![]() |
![]() |

`రంగ్ దే`తో రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కి `చెక్` పెట్టేశారు యూత్ స్టార్ నితిన్. ఈ క్రమంలోనే.. రాబోయే `మాస్ట్రో` నుంచి పొంతన లేని కథలతో, పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారాయన. ఇందులో భాగంగా.. `పవర్ పేట` పేరుతో ఓ రియలిస్టిక్ యాక్షన్ డ్రామా చేయనున్నారు నితిన్. ఆ సినిమా తరువాత ఓ కాప్ డ్రామాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. `పవర్ పేట`ని `ఛల్ మోహన్ రంగ` ఫేమ్ కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తుండగా.. కాప్ డ్రామాని `యాత్ర` దర్శకుడు మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేయనున్నారు.
కాగా పోలీస్ స్టోరీస్ లో నటించడం నితిన్ కి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే `హీరో`, `లై` చిత్రాల్లో నటించారు. అయితే, మహి వి. రాఘవ్ కాంబోలో చేయనున్న సినిమాలో పూర్తి స్థాయి పోలీసాఫీసర్ గా కనిపిస్తారట. అంతేకాదు.. పోలీస్ అధికారులైన ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణే ఈ కాప్ డ్రామాలోని సెంట్రల్ థీమ్ అని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. అచ్చొచ్చే రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ని వదిలి నితిన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు.. అతని కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |