![]() |
![]() |

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి రీమేక్ మూవీస్ లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే రెండు తమిళ సినిమాల రీమేక్స్ లో నటించాడు. తన సెకండ్ ఫిల్మ్ `స్పీడున్నోడు` కోలీవుడ్ సూపర్ హిట్ `సుందర పాండియన్`కి రీమేక్ కాగా.. తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచిన `రాక్షసుడు` కూడా తమిళ చిత్రం `రాక్షసన్`కి రీమేక్ వెర్షన్.
కట్ చేస్తే.. త్వరలో మరో తమిళ సినిమా రీమేక్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడట సాయిశ్రీనివాస్. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ `కర్ణన్`. ఏప్రిల్ 9న విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వసూళ్ళ వర్షం కురిపించింది. ``తన ఊరి ప్రజల హక్కులను కాపాడేందుకు ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడు?`` అనే పాయింట్ తో రూపొందిన `కర్ణన్`ని తమిళప్రజలు విశేషంగా ఆదరించారు. కాగా ఇప్పుడీ సినిమా తాలూకు తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సొంతం చేసుకున్నారని బజ్. త్వరలోనే `కర్ణన్` రీమేక్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
అన్నట్టు.. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ `ఛత్రపతి`కి రీమేక్ గా రూపొందనున్న హిందీ చిత్రంలోనూ సాయిశ్రీనివాస్ నటించనున్న విషయం విదితమే. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ యాక్షన్ డ్రామాని బాలీవుడ్ లో తెరకెక్కించనున్నారు.
![]() |
![]() |