![]() |
![]() |
.jpg)
ఇది ఎవరూ ఊహించనిది! జూనియర్ ఎన్టీఆర్-రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' రికార్డుని అల్లు అర్జున్ 'పుష్ప' బద్దలుకొట్టి రెండు రోజులు గడిచాయో లేదో.. ఇప్పుడు 'పుష్ప' రికార్డుని బాలకృష్ణ 'అఖండ' తుత్తునియలు చేసింది. మనం మాట్లాడుకుంటోంది 'అఖండ' టీజర్ గురించి. అవును. అత్యంత వేగంగా యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా ఇప్పుడు సగర్వంగా నిలిచింది 'అఖండ' టీజర్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
టాలీవుడ్‌లో 50 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకున్న మూడో టీజర్ 'అఖండ'. ఇదివరకు ఈ ఫీట్‌ను 'ఆర్ఆర్ఆర్' మూవీకి చెందిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్, అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్ సాధించాయి. 2020 అక్టోబర్ 20న విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌కు ఇప్పటివరకూ 50.63 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2021 ఏప్రిల్ 7న రిలీజైన 'పుష్ప' టీజర్‌కు ఇప్పటివరకూ 54.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును అందుకోవడానికి 'అఖండ' టీజర్ ఉరకలు వేస్తోంది. ఏప్రిల్ 13న విడుదలైన 'అఖండ' టీజర్‌కు ఇంతదాకా 50.17 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
'పుష్ప' టీజర్‌కు 50 మిలియన్ మార్కును చేరుకోవడానికి 20 రోజులు పడితే, అదే మార్కును అందుకోవడానికి 'అఖండ' టీజర్‌కు 16 రోజులు మాత్రమే పట్టింది. దీన్ని బట్టి 'అఖండ' టీజర్‌కు ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య చేస్తున్న సినిమా అంటేనే దాని క్రేజ్ వేరే లెవల్లో ఉంటుందనేందుకు ఈ టీజర్ నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మే 28న ఈ సినిమాని విడుదల చేయాలని ఇదివరకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాక విడుదల తేదీని ప్రకటించాలని వారు భావిస్తున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, "సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యగారితో చేస్తున్న'అఖండ' సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. బాలయ్య నటవిశ్వరూపాన్నిఈ సినిమాలో మరోసారి చూస్తారు. అతి తక్కువ రోజుల్లోనే 50మిలియన్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో 'అఖండ' టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను." అన్నారు.
![]() |
![]() |