![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ.. అఘోరా వేషంలో దర్శనమివ్వనున్న చిత్రం `అఖండ`. మాస్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ క్యారెక్టర్స్ లో సందడి చేయనున్నారు బాలయ్య. ఇటీవల విడుదలైన టైటిల్ రోర్ 50 మిలియన్ల వ్యూస్ చేరువలో ఉన్న వైనం చూస్తే.. బాలయ్య, బోయపాటి కాంబో మూవీపై జనాల్లో ఎంత ఆసక్తి నెలకొని ఉందో స్పష్టమవుతోంది. `సింహా`, `లెజెండ్` తరహాలోనే `అఖండ` కూడా అఖండ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూనే.. చిత్రీకరణ జరుపుతున్నారు. కేవలం రెండు వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని యూనిట్ వర్గాల సమాచారం. పతాక సన్నివేశాల్లో కొంత భాగం.. అలాగే బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ పై ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయట. మరి.. బాలయ్య, బోయపాటి థర్డ్ జాయింట్ వెంచర్ టికెట్ విండోస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న `అఖండ`ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
![]() |
![]() |