![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోడల్లుళ్ళుగా వినోదాలు పంచిన చిత్రం `ఎఫ్ 2`. 2019 సంక్రాంతికి వసూళ్ళ వర్షం కురిపించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి.. ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఎఫ్ 3` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని `ఎఫ్ 2` సృష్టికర్త అనిల్ రావిపూడినే రూపొందిస్తున్నాడు. `ఎఫ్ 2`ని నిర్మించిన `దిల్` రాజునే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్తగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ఆగస్టు 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా షూటింగ్ లో జాప్యం చోటుచేసుకోవడంతో సినిమా వాయిదా పడే అవకాశముందట. అంతేకాదు.. మే 14న రావాల్సిన `నారప్ప` కూడా తాజాగా వాయిదా పడడంతో.. `ఎఫ్ 3` కూడా అదే బాట పట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. 2022 సంక్రాంతికి `ఎఫ్ 3` రిలీజ్ కావచ్చనే వార్తలు వస్తున్నాయి.
మొత్తమ్మీద.. `ఎఫ్ 2`లాగే `ఎఫ్ 3` కూడా సేమ్ సీజన్ (సంక్రాంతి)లోనే వినోదాలు పంచనుందన్నమాట. త్వరలోనే `ఎఫ్ 3` విడుదలకు సంబంధించి మరింత క్లారిటీ రావచ్చు.
`ఎఫ్ 3`లో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ నటిస్తున్నారు.
![]() |
![]() |