![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న తన చిరకాల వాంఛను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు ప్రముఖ నిర్మాత `దిల్` రాజు. `వకీల్ సాబ్` రూపంలో రాజు ముచ్చట తీరింది. అంతేకాదు.. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ కోర్ట్ డ్రామా.. పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా వసూళ్ళపై ప్రభావం చూపినా.. వివిధ రూపాల్లో `దిల్` రాజు లాభాల బాట అయితే పట్టేశారు.
ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్` విజయం సాధించిన నేపథ్యంలో పవన్ తో మరో సినిమా చేసేందుకు రాజు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. భారీ మొత్తాన్ని పవర్ స్టార్ కి అడ్వాన్స్ గా కూడా ఇచ్చారని వినికిడి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `హరిహర వీరమల్లు`, హరీశ్ శంకర్ డైరెక్టోరియల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ అయ్యాక రాజు నిర్మాణంలో సినిమా చేసే దిశగా ప్రణాళిక వేశారట పవన్. సో.. 2022 చివరలోగానీ లేదా 2023 ప్రారంభంలో గానీ పవన్ - `దిల్` రాజు సెకండ్ జాయింట్ వెంచర్ పట్టాలెక్కే అవకాశముంది. దర్శకుడు, ఇతర వివరాలు మరికొద్ది నెలల్లో వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |