![]() |
![]() |

అల్లు అర్జున్ కెరీర్‌లో 'సరైనోడు' (2016) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బన్నీ కమర్షియల్ స్టామినాను పెంచిన సినిమాగా 'సరైనోడు' పేరు తెచ్చుకుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తన ఫ్యామిలీని అమితంగా ప్రేమించే, అందులోనూ బాబాయ్ (శ్రీకాంత్) అంటే విపరీతమైన ప్రేమను ప్రదర్శించే గణ పాత్రలో బన్నీ నటన అతని ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను.. అందులోనూ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే అప్పటివరకూ రిలీజైన బన్నీ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
అందుకే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయిన సందర్భంగా అల్లు అర్జున్ స్పందించాడు. ఆన్ లొకేషన్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసి, "ఐదేళ్ల 'సరైనోడు'. నా కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ఫిల్మ్. నా కెరీర్‌లోని మరపురాని సినిమాల్లో ఒకటిగా నిలిపిన నా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా, ఆది పినిశెట్టి, తమన్, గీతా ఆర్ట్స్, మొత్తం యూనిట్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా. గ్రాటిట్యూడ్." అని రాసుకొచ్చాడు.
బన్నీ షేర్ చేసిన ఫొటోలో బోయపాటి శ్రీను టీ తాగుతూ ఏదో చెప్తుంటే బన్నీ హాయిగా నవ్వుతున్నాడు. వాళ్లిద్దరి మాటలు వింటూ ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ కూడా నవ్వుతూ కనిపిస్తున్నాడు.
'సరైనోడు' పేరుతోటే యూట్యూబ్‌లో విడుదల చేసిన హిందీ డబ్బింగ్ వెర్షన్ వ్యూస్ పరంగా ఇండియన్ రికార్డ్ నెలకొల్పింది. యూట్యూబ్‌లో అత్యధికులు వీక్షించిన భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.
![]() |
![]() |