![]() |
![]() |

ఒకవైపు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు రణ్ బీర్ కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఇమ్రాన్ ఖాన్ వంటి యువ కథానాయకులతోనూ నటిస్తుంటుంది కత్రినా కైఫ్. అందుకే.. దాదాపు 18 ఏళ్ళుగా హిందీ చిత్ర సీమలో నాయికగా రాణించగలుగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
కాగా, కత్రినా తాజా చిత్రం `సూర్యవంశీ` ఏప్రిల్ 30న రిలీజ్ కి రెడీ అయింది. ఇందులో అక్షయ్ కుమార్ కి జంటగా ఆమె కనువిందు చేయనుంది. ఆపై సల్మాన్ ఖాన్ తో `టైగర్ 3` కోసం మరోసారి జట్టుకట్టనుంది. ఇక యువ కథానాయకులు ఇషాన్ కట్టర్, సిద్ధాంత్ చతుర్వేదితో కలసి మిస్ కైఫ్ యాక్ట్ చేసిన `ఫోన్ భూత్` నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కత్రినా మరో ఆసక్తికరమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. `ఫ్రెడ్డీ` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కి జంటగా కత్రినా దర్శనమివ్వనుంది. ఈ చిత్రాన్ని రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై షారుఖ్ ఖాన్ నిర్మించనుండడం విశేషం.
మొత్తమ్మీద.. వరుస చిత్రాలతో కత్రినా కైఫ్ బాలీవుడ్ లో మరికొంతకాలం హవా చాటనుందన్నమాట.
![]() |
![]() |