![]() |
![]() |

`బాగీ` సిరీస్ తో హిందీనాట కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. తెలుగు చిత్రం `వర్షం` ఆధారంగా తెరకెక్కిన `బాగీ`లో శ్రద్ధా కపూర్ నాయికగా నటించగా.. మరో టాలీవుడ్ మూవీ `క్షణం` ఆధారంగా రూపొందిన `బాగీ 2`లో దిశా పటాని హీరోయిన్. ఇక తమిళ చిత్రం `వేట్టై` (`తడాఖా`కి మాతృక) ఆధారంగా తయారైన `బాగీ 3`లో మరోసారి శ్రద్ధా కపూర్ నాయికగా నటించింది. కట్ చేస్తే.. ఇప్పుడు మరో `బాగీ`తో పలకరించనున్నాడు టైగర్.
`బాగీ 4` పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ నాయికగా ఎంపికైంది. షాజిద్ నడియాడ్ వాలా నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి.. టైగర్, సారా జోడీ `బాగీ 4`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, టైగర్ ప్రస్తుతం `హీరో పంటి 2`తో బిజీగా ఉన్నాడు. సారా విషయానికొస్తే.. ధనుష్ కి జోడీగా `అతరంగిరే`, విక్కీ కౌశల్ కి జంటగా `ఇమ్మోర్టల్ అశ్వథ్థామ` చిత్రాల్లో నటిస్తోంది.
![]() |
![]() |