![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న మలయాళ నటుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు వరుస విజయాలు చూస్తూ `టాక్ ఆఫ్ మాలీవుడ్` అవుతున్నారు ఫాహద్.
ఇదిలా ఉంటే.. ఈ వేసవిలో ఫాహద్ ముచ్చటగా మూడు చిత్రాలతో హవా చాటుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీటిలో రెండు సినిమాలు ఓటీటీ వేదికల్లో రిలీజ్ కానుండగా.. మరొకటి థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 2న ఫాహద్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ `ఇరుళ్` దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కట్ చేస్తే.. ఐదు రోజుల తరువాత అంటే ఏప్రిల్ 7న `జోజీ` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇక మే 13న రంజాన్ స్పెషల్ గా పొలిటికల్ క్రైమ్ డ్రామా `మాలిక్` థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో కనిపించనున్నారు ఫాహద్. మొత్తంగా.. ఆరు వారాల్లో మూడు సినిమాలతో ఫాహద్ అలరించనున్నారన్నమాట.
కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `పుష్ప`తో ఫాహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |