![]() |
![]() |

మలయాళంలో ఘనవిజయం సాధించిన `లూసీఫర్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని ప్రారంభించనున్నారు. ఈ సినిమా కోసమే చిరుకి తొలిసారిగా యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి `రారాజు` అనే టైటిల్ ని ఫిక్స్ చేసిందట యూనిట్. దీనికి మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే టైటిల్, ఇతర నటీనటుల వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, చిరు తాజా చిత్రం `ఆచార్య` చిత్రీకరణ తుది దశలో ఉంది. వేసవి కానుకగా మే 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సోషల్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |