![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. కొరటాల శివ (ఆచార్య), రాజమౌళి (ఆర్ ఆర్ ఆర్), శంకర్.. ఇలా స్టార్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్స్ట్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలపైనా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వీటిలో ముందుగా `ఆచార్య` థియేటర్స్ లోకి రానుంది. సమ్మర్ స్పెషల్ గా మే 13న `ఆచార్య` జనం ముందుకు వస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు వేసవి సీజన్ లో వచ్చిన చరణ్ చిత్రాలు మంచి విజయమే సాధించాయి. 2012 సమ్మర్ స్పెషల్ గా వచ్చిన `రచ్చ`.. డివైడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ ని మెప్పించింది. ఇక 2018 సమ్మర్ లో రిలీజైన `రంగస్థలం` అయితే తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే నటుడిగా చరణ్ కి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో చెర్రీ స్క్రీన్ షేర్ చేసుకున్న `ఆచార్య` కూడా మండుటెండల కాలంలోనే విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. `ఆచార్య` చిత్రంలో `సిద్ధ`గా నటించిన చరణ్.. సమ్మర్ హ్యాట్రిక్ కి `సిద్ధ`మేనంటూ బరిలోకి దిగుతున్నాడు.
మరి.. మరోమారు చరణ్ ఖాతాలో వేసవి విజయం చేరుతుందేమో చూడాలి.
![]() |
![]() |