![]() |
![]() |

`కేజీఎఫ్`తో పాన్ - ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ కన్నడ దర్శకుడు.. త్వరలో `కేజీఎఫ్ ఛాప్టర్ 2`తో పలకరించబోతున్నాడు. ఈ లోపే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సలార్` అనే మరో పాన్ - ఇండియా మూవీని పట్టాలెక్కించాడు. అంతేకాదు.. యంగ్ టైగర్ యన్టీఆర్ తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తరువాత ప్రభాస్ తోనే `దిల్` రాజు నిర్మాణంలో ఓ మూవీ చేయబోతున్నాడని కథనాలు వస్తున్నాయి.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ తోనూ ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందట. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు సెట్ చేస్తున్నారని టాక్. అదే గనుక నిజమైతే.. ప్రశాంత్ నీల్ ఖాతాలో మరో స్టార్ హీరో చేరినట్టే. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, రీసెంట్ గా `మాస్టర్`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్.. త్వరలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే నాయికగా నటించనుంది. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలోనూ విజయ్ ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కథనాలు వస్తున్నాయి.
![]() |
![]() |