![]() |
![]() |

ప్రభాస్ అంటే మాస్‌కు డార్లింగ్. లేటెస్ట్‌గా ఆయన తన ఇంటికి ఓ కారును తీసుకువెళ్లాడు. దాని ఖరీదు బాహుబలి రేంజ్‌లో ఉండటం గమనార్హం. అవును. ప్రభాస్ 'లంబోర్గిని అవెంటడోర్ రోడ్‌స్టర్' కారును కొన్నాడు. ఇండియాలో దాని ఖరీదు రూ. 5.6 కోట్లు. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే రూ. 6 కోట్ల కంటే ఎక్కువవుతుంది.
భారతీయ సెలబ్రిటీలు వాడే అత్యంత ఖరీదైన కార్లలో లంబోర్గిని బ్రాండ్ ఒకటి. అలాంటి కారును ప్రభాస్ తన ఇంటికి తీసుకు వెళ్లాడనే వార్త ఆయన ఫ్యాన్స్‌కు తెగ సంతోషాన్నిస్తోంది. ఆ కారు ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్‌లో ఉంది. బ్రైట్ ఆరెంజ్ కలర్‌లో ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోంది ఆ కారు. లంబోర్గిని అవెంటడోర్ రోడ్‌స్టర్ అంటే ఏమిటో కారు ప్రేమికులకు బాగా తెలుసు. ఆ కారు ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను, వీడియోలను ప్రభాస్ ఫ్యాన్స్ విరివిగా షేర్ చేస్తున్నారు. వాటిలో లంబోర్గిని కారును పట్టుకొని నిల్చొని ఉన్న ప్రభాస్‌ను మనం చూడొచ్చు. తాను కార్ల ప్రేమికుడిననీ, లంబోర్గిని కారు కొనాలనేది తన కోరిక అని ఒకసారి ఆయన చెప్పాడు. ఇప్పటికే ప్రభాస్ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యు, ఆడి క్యూ5 లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

వర్క్ విషయానికి వస్తే 'రాధే శ్యామ్' సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు. జూలై 30న ఆ సినిమా విడుదల కానున్నది. ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో చేస్తున్న 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'సలార్' సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని చేయనున్నాడు ప్రభాస్.
![]() |
![]() |