![]() |
![]() |

ఓవర్సీస్ మార్కెట్ లో `మిలియన్ డాలర్` బెంచ్ మార్క్ చేరడాన్ని.. కొన్నేళ్ళ క్రితం ఓ ప్రతిష్ఠాత్మక విషయంగా భావించేవారు. `దూకుడు` (2011)తో మొదలైన ఈ `మిలియన్ డాలర్` ముచ్చట.. `బాహుబలి` సిరీస్ తో పతాక స్థాయికి చేరుకుంది. హై బడ్జెట్ వెంచర్స్ నుంచి మీడియం బడ్జెట్ మూవీస్, లో - బడ్జెట్ ఫిల్మ్స్ వరకు పలు సినిమాలు `మిలియన్ డాలర్` క్లబ్ లో చేరి వార్తల్లో నిలిచాయి. ఆ జాబితాలో మరో తెలుగు సినిమా చేరింది. అదే.. `జాతిరత్నాలు`.
విడుదలైన తొలి రోజు నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ `జాతిరత్నాలు` వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. యూనిట్ కూడా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం.. కలెక్షన్ల పరంగా ప్లస్ అయిందనే చెప్పాలి. కట్ చేస్తే.. రీసెంట్ గా `జాతిరత్నాలు` మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. ఎందుకంటే.. కరోనా అనంతరం విడుదలైన తెలుగు సినిమాల్లో `మిలియన్ డాలర్` మార్క్ టచ్ చేసిన మూవీ `జాతిరత్నాలు` మాత్రమే. అంతేకాదు.. ఈ మూడు నెలల్లో మరే భారతీయ సినిమా ఇలాంటి ఫీట్ చేయలేకపోయిందన్నది ట్రేడ్ వర్గాల మాట. మొత్తమ్మీద.. `జాతిరత్నాలు` ఓవర్సీస్ మార్కెట్ లో నయా రికార్డ్ నెలకొల్పిందన్నమాట.
![]() |
![]() |