![]() |
![]() |

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన `టక్ జగదీష్` ఏప్రిల్ 23న విడుదలకు సిద్ధం కాగా.. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉంది. ఇక రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న `అంటే.. సుందరానికీ!` త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ మూడు చిత్రాల తరువాత నాని.. ఓ నూతన దర్శకుడి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఈ మూవీని రూపొందిస్తాడని తెలిసింది. ఇప్పటికే నానికి శ్రీకాంత్ స్క్రిప్ట్ వినిపించాడని.. ఇన్నోవేటివ్ గా ఉండడంతో నాని వెంటనే ఓకే చెప్పాడని బజ్. అంతేకాదు.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతోందని వినికిడి. త్వరలోనే నాని, శ్రీకాంత్ కాంబినేషన్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |