![]() |
![]() |

పాత కథలకు కొత్త ట్రీట్ మెంట్ ఇచ్చి.. జనరంజకంగా సినిమాలను రూపొందించడం అన్నది అనాదిగా ఉన్న వ్యవహారమే. ఇలా తెరకెక్కి విజయం సాధించిన చిత్రాలు.. టాలీవుడ్ లో కోకొల్లలు. ఇప్పుడిదే శైలిలో మరో సినిమా రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `నేను లోకల్` డైరెక్టర్ త్రినాథరావ్ నక్కిన ఓ మాస్ ఎంటర్ టైనర్ ని తీయబోతున్న సంగతి తెలిసిందే. ఉగాదికి ప్రారంభమై.. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందని టాక్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ `ఘరానా మొగుడు`కి మరో వెర్షన్ లా తీర్చిదిద్దుతున్నారని ప్రచారం సాగుతోంది. కథ పాతదే అయినా.. ట్రీట్ మెంట్ మాత్రం ఇప్పటివారి అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందని బజ్. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, రవితేజ తాజా చిత్రం `ఖిలాడి` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. వేసవి కానుకగా మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |