![]() |
![]() |

`అరవింద సమేత` (2018) వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `యన్టీఆర్ 30`గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఏప్రిల్ లో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. `యన్టీఆర్ 30`లో ప్రతినాయకుడు పాత్ర ఎవరు పోషిస్తారనే విషయంలో యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్`లో లంకేశ్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. తారక్ 30లో విలన్ గా నటించబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. తారక్, సైఫ్ మధ్య డిష్యూమ్ డిష్యూమ్ ఏ రీతిలో సాగుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, యన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` విజయదశమి కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టిస్టారర్ పిరియడ్ డ్రామాని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు.
![]() |
![]() |