![]() |
![]() |

న్యూఢిల్లీలో నేడు ప్రకటించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ, బెంగాలీ, హిందీ చిత్రాలు అత్యధిక పురస్కారాలను గెలుచుకున్నాయి. పోర్చుగీసు వారిపై పోరాడిన నావికా దళపతి కుంజలి మరక్కర్ కథతో డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన మలయాళం చిత్రం 'మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో టైటిల్ రోల్‌ను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ పోషించారు.
జాతీయ ఉత్తమ నటులుగా ఈసారి ఇద్దరు ఎంపికయ్యారు. తమిళ చిత్రం 'అసురన్'లో అసమాన నటన ప్రదర్శించిన ధనుష్, హిందీ చిత్రం 'భోంస్లే'లో టైటిల్ రోల్ పోషించిన మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటులుగా నిలవగా, వివాదాల్లో నిలిచిన 'మణికర్ణిక: ఝాన్సీకీ రాణి'లో టైటిల్ పాత్రధారి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇది ఆమెకు నాలుగో జాతీయ అవార్డు కావడం విశేషం. ఇదివరకు ఆమె 'క్వీన్', 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రాల్లో నటనకు గాను ఉత్తమ నటిగా, 'ఫ్యాషన్' మూవీలో పాత్రకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకుంది.
తమిళ నటుడు విజయ్ సేతుపతికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది. విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందిన 'సూపర్ డీలక్స్'లో ట్రాన్స్‌జెండర్‌గా అతను సూపర్బ్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

అవార్డుల లిస్ట్
ఉత్తమ చిత్రం - మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ (మలయాళం)
బెస్ట్ యాక్టర్ - ధనుష్ (అసురన్ - తమిళం), మనోజ్ బాజ్‌పేయి (భోంస్లే - హిందీ)
బెస్ట్ యాక్ట్రెస్ - కంగనా రనౌత్ (మణికర్ణిక - హిందీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్ - తమిళం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - పల్లవీ జోషి (ద తాష్కెంట్ ఫైల్స్ - హిందీ)
బెస్ట్ డైరెక్షన్ - సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరై - హిందీ)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - మత్తుకుట్టి జేవియర్ (హెలెన్ - మలయాళం)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - నాగ విశాల్ (కేడీ - తమిళం)
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ - అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
బెస్ట్ కొరియోగ్రఫీ - రాజు సుందరం (మహర్షి - తెలుగు)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ - ఒత్త సెరుప్పు సైజ్ 7 (తమిళం)
బెస్ట్ లిరిక్స్ - ప్రభావర్మ (కొలాంబి - మలయాళం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ - డి. ఇమ్మాన్ (విశ్వాసమ్ - తమిళం)
బెస్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ - ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్ఠోపుత్రో - బెంగాలీ)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - రంజిత్ (హెలెన్ - మలయాళం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - ఆనందీ గోపాల్ (మరాఠీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ - ఐదుహ్ (ఖాసీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ (రి-రికార్డిస్ట్ ఆఫ్ ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్) - ఒత్త సెరుప్పు సైజ్ 7 (తమిళం)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) - జ్యేష్ఠోపుత్రో (బెంగాలీ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) - గుమ్‌నామి (బెంగాలీ)
బెస్ట్ డైలాగ్స్ - ద తాష్కెంట్ ఫైల్స్ ( హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - జల్లికట్లు (మలయాళం)
బెస్ట్ ఎడిటింగ్ - నవీన్ నూలి (జెర్నీ - తెలుగు)
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ - కస్తూరి (హిందీ)
బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ - వాటర్ బరియల్ (మోన్పా)
బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్ - ఆనంది గోపాల్ (మరాఠీ)
బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తాజ్‌మహల్ (మరాఠీ)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ - మహర్షి (తెలుగు)
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - సావని రవీంద్ర (బర్డో - మరాఠీ)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - బి. ప్రాక్ (కేసరి - హిందీ)
మరికొన్ని ముఖ్యమైన ప్రాంతీయ అవార్డులు
ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
ఉత్తమ తమిళ చిత్రం - అసురన్
ఉత్తమ హిందీ చిత్రం - చిచ్చోరే
ఉత్తమ మలయాళం చిత్రం - కల్ల నోట్టమ్
ఉత్తమ మరాఠీ చిత్రం - బర్డో
ఉత్తమ కన్నడ చిత్రం - అక్షి
ఉత్తమ బెంగాలీ చిత్రం - గుమ్‌నామి
ఉత్తమ అస్సామీ చిత్రం - రోణువా
![]() |
![]() |