![]() |
![]() |

పేరుపొందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని 'అరణ్య' మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో విష్ణు స్వయంగా అనౌన్స్ చేశాడు. పిచ్చ ప్రేమలో ఉన్న విష్ణు-జ్వాల తమ రొమాంటిక్ పిక్చర్స్, వీడియోలతో సోషల్ మీడియాను తరచూ వేడెక్కిస్తూనే ఉన్నారు. తాజా వార్తతో ఆ ఇద్దరిదీ ఎంతటి గాఢమైన ప్రేమో తెలుస్తోంది.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'అరణ్య' ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేశ్, రానా దగ్గుబాటి లాంటి టాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పాల్గొన్నాడు విష్ణు విశాల్. ఈ మూవీలో అతను ఓ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఈవెంట్‌కు అతను తన గాళ్‌ఫ్రెండ్ గుత్తా జ్వాలతో కలిసి వచ్చాడు. ఆ ఇద్దర్నీ జంటగా చూసిన వాళ్లంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారు. మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా త్వరలో జ్వాల, తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు విష్ణు. "జ్వాలకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా టైమ్‌లో తను నాకు గ్రేట్ సపోర్ట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలమూ తను లొకేషన్‌లోనే ఉంది. నిజంగా మేం త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాం. అంటే నేను తెలుగు అల్లుడ్ని కాబోతున్నా. దీనికి నేనెంతో సంతోషంతో ఉన్నా." అని చెప్పాడు. అతడు ఈ విషయం చెప్పగానే ఇంటర్నెట్‌లో ఈ వార్త వైరల్ అయ్యింది. విష్ణు, జ్వాల అభిమానులు ఆనందంతో తబ్బిబ్బు అవుతున్నారు.

చాలామందికి తెలీని విషయం ఏమంటే, 2010లో యాక్టర్ నటరాజ్ కుమార్తె రజనీని విష్ణు వివాహం చేసుకున్నాడు. 2017లో ఆ దంపతులకు ఆర్యన్ అనే కొడుకు పుట్టాడు. కానీ ఆ తర్వాతి సంవత్సరమే ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దానికి కారణాలు బయటకు తెలీలేదు. మరోవైపు జ్వాల సైతం తోటి బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్‌ను ప్రేమించి 2005లో పెళ్లాడింది. కానీ ఇద్దరి మధ్యా అనుబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2011లో వారు విడిపోయారు. అలా జ్వాల, విష్ణు ఇద్దరికీ ఇది సెకండ్ మ్యారేజే అన్నమాట.
![]() |
![]() |