![]() |
![]() |
.jpg)
`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ.. వరుస చిత్రాలు ప్లాన్ చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారు. ప్రస్తుతం `రాక్షసుడు` ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్న రవితేజ.. ఆపై `నేను లోకల్` డైరెక్టర్ త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారు. `ఖిలాడి` మే 28న థియేటర్స్ లో సందడి చేయనుండగా.. త్రినాథరావ్ డైరెక్టోరియల్ ఏడాది చివరలో రిలీజ్ కానుందని టాక్.
ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. `అ!`తో దర్శకుడిగా పరిచయమై.. ఆపై `కల్కి`, `జాంబీరెడ్డి` వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రవితేజకి ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది నచ్చడంతో.. రవితేజ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పారని బజ్. త్వరలోనే రవితేజ, ప్రశాంత్ వర్మ కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
అన్నట్టు.. `అ!`లో బొన్సాయ్ మొక్కకి రవితేజ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |