![]() |
![]() |

ఒకవైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు ప్రత్యేక గీతాల్లో కనువిందు చేస్తోంది `జబర్దస్త్` బ్యూటీ అనసూయ. ఆ మధ్య `విన్నర్` (2017)లో `సూయ సూయ అనసూయ` అనే డ్యాన్స్ నంబర్ లోనూ.. `ఎఫ్ 2` (2019)లో `డింగ్ డాంగ్` అనే స్పెషల్ సాంగ్ లోనూ తన నృత్యాలతో అలరించింది అనసూయ. అంతేకాదు.. రీసెంట్ గా రిలీజైన `చావు కబురు చల్లగా`లోనూ `పైన పటారం` అంటూ కుర్రకారుని ఫిదా చేసింది.
కట్ చేస్తే.. మరో ప్రత్యేక గీతంలో అనసూయ చిందేయనుందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో `మహాసముద్రం` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథానుసారం ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఆ పాటలో అనసూయ స్టెప్పులేయనుందని వినికిడి. త్వరలోనే `మహాసముద్రం`లో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
జగపతిబాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న `మహాసముద్రం`.. ఆగస్టు 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |