![]() |
![]() |

'తిప్పరా మీసం' సినిమాలో శ్రీవిష్ణు సరసన నాయికగా నటించిన గ్లామరస్ గాళ్ నిక్కీ తంబోలి ఈరోజు ఉదయం కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉంది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే బాలీవుడ్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాననీ, త్వరలోనే కోలుకుంటాననే ఆశాభావాన్ని ఈ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ వ్యక్తం చేసింది.
(1).jpg)
'కాంచన 3'లో లారెన్స్ సరసన నటించిన నిక్కీ.. ప్రస్తుతం ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌తో బిజీగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో, "ఈ రోజు పొద్దున్నే నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి, అవసరన జాగ్రత్తలు తీసుకుంటూ, నా డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ వాడుతున్నాను. గత కొద్ది రోజులుగా నాకు దగ్గరగా మెలగిన వాళ్లందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ లవ్‌కూ, సపోర్ట్‌కూ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎల్లప్పుడూ మీ మాస్క్‌లను ధరిస్తూ, రెగ్యులర్‌గా మీ చేతులను శానిటైజ్ చేసుకుంటూ, సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తూ, క్షేమంగా ఉండేట్లు చూసుకోండి." అని రాసుకొచ్చింది.

'చీకటి గదిలో చిలక్కొట్టుడు' హీరోయిన్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆశిద్దాం.
(1).jpg)
![]() |
![]() |