![]() |
![]() |
.jpg)
`ఇస్మార్ట్ శంకర్`తో మాస్ లో ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. `రెడ్`లో ఆ మాస్ డోస్ కాస్త తగ్గిన నేపథ్యంలో.. లింగుస్వామి డైరెక్షన్ లో చేస్తున్న బైలింగ్వల్ మూవీతో ఆ లోటుని భర్తీ చేసే పనిలో ఉన్నారీ పోతినేని వారి హ్యాండ్సమ్ హీరో. పక్కా ఊర మాస్ మూవీగా ఈ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. లింగుస్వామి కాంబినేషన్ మూవీ తరువాత కూడా మరో ఊర మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారట రామ్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. అంతేకాదు.. నటసింహ నందమూరి బాలకృష్ణతో బోయపాటి చేస్తున్న `BB3`ని నిర్మిస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డినే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తారని టాక్. ఈ ఏడాది చివరలో రామ్ - బోయపాటి ఫస్ట్ జాయింట్ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు.
మరి.. బ్యాక్ టు బ్యాక్ ఊర మాస్ ఎంటర్ టైనర్స్ తో రామ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |