![]() |
![]() |

వెండితెరపై హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా.. ఇలా పలు రకాల పాత్రల్లో రాణిస్తున్న బ్రహ్మాజీ ఛాన్స్ దొరికితే చాలు ఎదుటి వారిపై పంచ్ లేస్తుంటారు. ఇటీవల సినిమా ఫంక్షన్‌లలో సుమని టార్గెట్ చేస్తూ పంచ్ లేసిన బ్రహ్మాజీ తాజాగా నటి రజితని తన పంచ్‌లతో ఆడేసుకున్నాడు. ఈటీవీలో కొత్తగా ప్రారంభమైన కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'.
ప్రతీ ఆదివారం ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో వారం వారం ఓ కొత్త గెస్ట్ వచ్చేస్తుంటారు. వచ్చే వారం గెస్ట్‌గా బ్రహ్మాజీ రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఈ షోలో బ్రహ్మాజీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. "ఇప్పటి దాకా స్పీడ్ అంటే 4జీ.. ఇకపై స్పీడ్ అంటే బ్రహ్మాజీ" అని వస్తూ వస్తూనే పంచ్ వేశాడు. బ్రహ్మాజీ, రోహిణి మధ్య స్కిట్ నవ్వులు కురిపించింది.
ఆ తర్వాత ఈ షోలోకి సీనియర్ నటి రజిత ఎంట్రీ ఇచ్చింది. ఆవేశంగా చేయి పైకెత్తి, "లేచింది నిద్ర లేచింది మహిళా లోకం" అని ఆమె స్లోగన్ ఇవ్వగానే, బ్రహ్మాజీ స్టైల్‌గా "మరి ఇన్నాళ్లు ఎందుకు పడుకుందో.." అని సెటైరికల్‌గా పంచ్ వేశాడు. దీంతో రజిత బిక్కమొఖం వేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మాజీ పంచ్‌కి ఆడియెన్స్ నవ్వినట్లు చూపించారు. ఆ తర్వాత మరోసారి ఇదే స్లోగన్‌ను రజిత చెప్పగా, "ఎన్నిసార్లు లేస్తారమ్మా పడుకోరా మీరు?" అని ప్రశ్నించాడు బ్రహ్మాజీ. మొత్తానికి ఆడవాళ్లను ఈ ఎపిసోడ్ గౌరవిస్తుందా, అపహాస్యం చేస్తుందా అనే విషయం ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో తేలుతుంది.
![]() |
![]() |