![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `ఖిలాడి`. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా దర్శనమివ్వనున్నారు. `రాక్షసుడు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ఇటలీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. కథానుసారం `ఖిలాడి`లో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందంట. ఆ ఐటమ్ నంబర్ లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నర్తించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే `ఖిలాడి`లో పాయల్ స్పెషల్ సాంగ్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, గతంలో పాయల్.. `డిస్కోరాజా` చిత్రంలో రవితేజకి జంటగా నటించింది. స్వల్ప విరామం తరువాత ఇప్పుడు ప్రత్యేక గీతం చేయనుండడం విశేషం.
`ఖిలాడి`కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. మే 28న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |