![]() |
![]() |

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `ప్రేమమ్`తో మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు నివిన్ పాల్. ఆ సినిమా తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసిన నివిన్.. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత లేటెస్ట్ వెంచర్ తో పలకరించనున్నారు. ఆ చిత్రమే.. `తురముఖమ్`. రాజీవ్ రవి డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ డ్రామాని రంజాన్ కానుకగా మే 13న విడుదల చేయబోతున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సరిగ్గా అదే రోజున మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎపిక్ హిస్టారికల్ వార్ డ్రామా `మరక్కార్: అరబిక్ కడలింటే సింహమ్`, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో దర్శనమివ్వనున్న `మాలిక్` కూడా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. దీంతో.. కేరళనాట ఈ త్రిముఖ పోరుపై ఆసక్తినెలకొంది.
మరి.. మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్, నివిన్ పాల్ వంటి ప్రముఖ కథానాయకుల మధ్య సాగనున్న ఈ ఈద్ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |