![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణతో మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ ఎటెంప్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత రాబోతున్న ఈ చిత్రానికి `BB3` అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ భారీగా వేసిన ఓ టెంపుల్ సెట్ లో గత నాలుగు రోజులుగా కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారట. దాదాపు రూ. 30 లక్షల వ్యయంతో వేసిన ఈ భారీ టెంపుల్ సెట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని టాక్. ఈ నెల 22తో ఈ షెడ్యూల్ పూర్తవుతుందని.. ఆపై ఏప్రిల్ లో బెల్గాంలో ఔట్ డోర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. మరి.. డివోషనల్ టచ్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా.. బాలయ్య, బోయపాటి కాంబోకి హ్యాట్రిక్ ని అందిస్తుందో లేదో తెలియాలంటే మే 28వరకు వేచిచూడాల్సిందే.
బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ సంస్థ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |