![]() |
![]() |

కథానాయకుడి పాత్రల నుంచి ప్రతినాయకుడు, సహాయక పాత్రలకు షిప్ట్ అయ్యారు సీనియర్ స్టార్ జగపతిబాబు. ఈ క్రమంలోనే.. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటిస్తూ ముందుకు సాగుతున్నారాయన.
కాగా, తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో నటించే అవకాశం పొందారు జగ్గూభాయ్. ఆ చిత్రమే.. `అణ్ణాత్తే`. `శౌర్యం` శివ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్.. ఇలా వేర్వేరు తరాలకు చెందిన కథానాయికలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఇదే సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
కాగా, ఇప్పటికే రజినీకాంత్ కాంబినేషన్ లో `కథానాయకుడు` (2008), `లింగ` (2014) చిత్రాల్లో నటించారు జగ్గూభాయ్. అయితే, ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న సినిమాతోనైనా హిట్ దక్కుతుందేమో చూడాలి.
దీపావళి కానుకగా నవంబర్ 4న `అణ్ణాత్తే` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |