![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తారక్. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, `ఆర్ ఆర్ ఆర్` విడుదలయ్యేలోపే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సెకండ్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నారు యన్టీఆర్. మే లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ చిత్రం.. 2022 ఏప్రిల్ 29న రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది యన్టీఆర్ కి 30వ చిత్రం.
ఇక, యన్టీఆర్ తన 31వ చిత్రాన్ని `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనని తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రివీల్ చేయబోతున్నారట. ఇప్పటికే మైత్రీ వారు ఈ సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. అయితే, తారక్ బర్త్ డే స్పెషల్ గా మరిన్ని వివరాలతో `యన్టీఆర్ 31` అనౌన్స్ మెంట్ రాబోతోందని టాక్. కాగా, షూటింగ్ మాత్రం ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఉండొచ్చని వినికిడి.
![]() |
![]() |