![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పాన్ - ఇండియా మూవీస్ ఉన్నాయి. వాటిలో పిరియడ్ లవ్ సాగా `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధం కాగా.. యాక్షన్ సాగా `సలార్` సెట్స్ పై ఉంది. ఇక మైథలాజికల్ టచ్ ఉన్న `ఆదిపురుష్` త్వరలోనే పట్టాలెక్కే దిశగా ఉండగా.. నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇదో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ సినిమా తరువాత బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తో ప్రభాస్ ఓ మల్టిస్టారర్ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడని బాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమా కోసం ప్రభాస్ నెవర్ బిఫోర్ సీన్ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |