![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సోషల్ డ్రామా.. 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యేలోపే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట మహేశ్. దానికి తగ్గట్టే.. ఇటీవల అనిల్ కూడా మహేశ్ తో కథాచర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. అంతేకాదు.. ఇదో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుందని బజ్. తన కెరీర్ ని కీలక మలుపు తిప్పిన `ఒక్కడు` (2003) తరువాత మహేశ్ బాబు మరో క్రీడా నేపథ్య చిత్రం చేయలేదు. ఈ నేపథ్యంలో.. అనిల్ సినిమా అదే జానర్ లో రాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. మహేశ్ కోసం అనిల్ ఏ ఆటని కథాంశంగా చేసుకున్నాడో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్ 3` చేస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆగస్టు 27న జనం ముందుకు రానుంది. 2019 నాటి బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2`కి ఇది సీక్వెల్.
![]() |
![]() |