![]() |
![]() |

విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `కోబ్రా`. `డిమాంటి కాలనీ`, `ఇమైక్క నోడిగళ్` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిథి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రహమాన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని 2020 రంజాన్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, కరోనా కారణంగా షెడ్యూల్ లో జాప్యం జరిగింది. కట్ చేస్తే.. ఈ ఏడాది రంజాన్ కి (మే 13) ఈ సినిమాని జనం ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.
మరి.. `అపరిచితుడు` తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన విక్రమ్.. `కోబ్రా`తోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
కాగా, తన తనయుడు ధ్రువ్ తో విక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సిమ్రన్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది.
![]() |
![]() |