![]() |
![]() |

`కంచె`(2015)తో తెలుగువారికి చేరువయ్యింది ఉత్తరాది భామ ప్రగ్యా జైశ్వాల్. ఆపై `ఓం నమో వేంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయజానకి నాయక`, `ఆచార్య అమెరికా యాత్ర`.. ఇలా పలు చిత్రాల్లో సందడి చేసినా ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఇటీవల మూడు ఆసక్తికరమైన సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుందీ ఈ గార్జియస్ బ్యూటీ. ఆ చిత్రాలే.. `అంతిమ్` (హిందీ), BB3 (వర్కింగ్ టైటిల్), `సన్ ఆఫ్ ఇండియా`.
`అంతిమ్`లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జోడీగా నటిస్తున్న ప్రగ్య.. BB3`లో నటసింహ నందమూరి బాలకృష్ణకి జంటగా కనువిందు చేయనుంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న `సన్ ఆఫ్ ఇండియా`లో ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది ప్రగ్య. అంతేకాదు.. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించబోతోందట ప్రగ్య. ఈ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే ప్రగ్య పాత్రకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |