![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. `సింహా`, `లెజెండ్`.. ఇలా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆయా సినిమాల విజయాల్లో పవర్ ఫుల్ టైటిల్స్ కూడా ముఖ్య భూమిక పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలోనే.. తమ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ కి మరో పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట బాలయ్య అండ్ బోయపాటి. `మోనార్క్`, `గాడ్ ఫాదర్`తో సహా పలు పేర్లను పరిశీలించి.. చివరాఖరికి `గాడ్ ఫాదర్` వైపు మొగ్గు చూపించారట. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టీజర్ తో గానీ మోషన్ పోస్టర్ తో గానీ ఈ టైటిల్ ని రివీల్ చేసే అవకాశముందని టాక్. త్వరలోనే బాలయ్య - బోయపాటి కాంబో మూవీ టైటిల్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
కాగా, బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
![]() |
![]() |