![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ కథానాయకుడిగా నటించిన నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` విడుదలకు సిద్ధమైంది. `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జూన్ 19న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ లోగా స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు అఖిల్. హీరోగా తనకిది ఐదో సినిమా.
కాగా, ఆరో చిత్రాన్ని టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `ఉప్పెన`ని డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేసే అవకాశముందని బజ్. అంతేకాదు.. ఈ కాంబినేషన్ ని కింగ్ నాగార్జున సెట్ చేశారని, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అఖిల్ - బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ ఉండొచ్చని కథనాలు వస్తున్నాయి. అలాగే, హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |