![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. చరణ్ సోలో హీరోగా నటించనున్న ఈ సినిమా రేసీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని బజ్. అంతేకాదు.. శంకర్ గత చిత్రాల తరహాలో భారీ గ్రాఫిక్స్, భారీ సెట్స్ కి ఇందులో స్కోప్ ఉండదని వినికిడి. వీలైనంత త్వరగా సినిమాని పూర్తిచేసేలా.. శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. అలాగే.. ఇందులో చరణ్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమిస్తారని అంటున్నారు. కాగా, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చరణ్ - శంకర్ కాంబో మూవీ అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుందని టాక్.
మరి.. చరణ్ - శంకర్ ఫస్ట్ కాంబో వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |