![]() |
![]() |
.jpg)
మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వరకర్తల్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150` మ్యూజికల్ గా మెప్పించాయి. వీటిలో `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్`, `ఖైదీ నంబర్ 150` అయితే కమర్షియల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత చిరు, డీఎస్పీ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో చిరంజీవి ఓ పక్కా కమర్షియల్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది. కాగా, ఈ చిత్రానికే దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించబోతున్నారని సమాచారం. త్వరలోనే డీఎస్పీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ సినిమాతోనూ మెగాస్టార్, రాక్ స్టార్ కాంబో మ్యూజికల్ గా ఎంటర్ టైన్ చేస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య` మే 13 థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |