![]() |
![]() |

సల్మా హయక్ అనగానే గుర్తొచ్చే మూవీ 'డెస్పరాడో' (1995). ఆంటోనియో బాండరాస్ హీరోగా నటించిన ఆ మూవీని రాబర్డ్ రోడ్రిగ్జ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో ఆంటోనియో, సల్మా మధ్య శృంగార సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. తాజాగా ఆ సీన్ షూటింగ్ సందర్భంగా తాను ఎలాంటి భావోద్వేగానికి గురయ్యిందీ సల్మా వెల్లడించారు.
ఆంటోనియోతో ఆ ఇంటిమేట్ సీన్ చిత్రీకరణ జరిగేంతసేపూ తాను ఏడుస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. తనకు స్క్రిప్ట్ వినిపించినప్పుడు ఆ సెక్స్ సీన్ లేదని ఆమె చెప్పారు. కానీ ప్రొడక్షన్ హౌస్ హీరో హీరోయిన్ల మధ్య అలాంటి సీన్ ఒకటి తప్పకుండా ఉండాలని డిమాండ్ చేసిందంట.
దాంతో క్లోజ్డ్ సెట్‌లో ఆంటోనియో బాండరాస్, రాబర్ట్ రోడ్రిగ్జ్, నిర్మాత ఎలిజిబెత్ అవెలాన్ (రోడ్రిగ్జ్ అప్పటి భార్య) సమక్షంలో మాత్రమే ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారు సల్మా. "కానీ, ఆ సీన్ చేయడం ఆమెకు ఏమాత్రం సౌకర్యంగా అనిపించలేదు. మేం ఎప్పుడు ఆ సీన్ షూట్ చేయడం ప్రారంభించామో, ఆ క్షణం నుంచీ నేను ఏడవడం మొదలుపెట్టాను." అని ఆమె చెప్పారు.

తాను ఆ సీన్ చేయడానికి భయపడ్డానికి కారణం ఆంటోనియో అని ఆమె వెల్లడించారు. "ఆంటోనియో జెంటిల్‌మన్, చాలా మంచి మనిషి, ఇప్పటికీ మేం సన్నిహిత స్నేహితులం. కానీ అతను చాలా ఫ్రీగా మూవ్ అవుతాడు. ఆ సీన్ చేయడం అతనికి ఓ విషయమే కాదు. అదే నన్ను భయపెట్టింది." అని చెప్పారు సల్మా.
అయితే ఆంటోనియో కానీ, రోడ్రిగ్జ్ కానీ తనను ఆ సీన్ చేసే విషయంలో ఏమాత్రం ఒత్తిడి చేయలేదనీ, ఆ ఇద్దరూ అమేజింగ్ పర్సన్స్ అనీ ఆమె స్పష్టం చేశారు. "నేను ఒంటిమీద టవల్‌ను తీసేదాన్ని కాదు. ఆ ఇద్దరూ నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవారు. ఒకట్రెండు సెకన్ల పాటు ఆ టవల్‌ను తీసేసేవారు. నేను మళ్లీ ఏడుపు అందుకొనేదాన్ని." అని ఆమె ఆ సీన్ తీసిన విధానం గురించి వివరించారు.
![]() |
![]() |