![]() |
![]() |

తన తొలి చిత్రం `ఈ రోజుల్లో..` తో మొదలుకుని గత సినిమా `ప్రతి రోజూ పండగే` వరకు సొంత కథలకే ప్రాధాన్యమిచ్చారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి. వీటిలో సింహభాగం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కొన్ని చిత్రాలైతే రీమేక్ అయ్యాయి కూడా. అలాంటి మారుతి.. తాజా సినిమా కోసం రీమేక్ బాట పడుతున్నారని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో `పక్కా కమర్షియల్` పేరుతో మారుతి ఓ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. నాలుగేళ్ళ క్రితం హిందీనాట వసూళ్ళ వర్షం కురిపించిన అక్షయ్ కుమార్ చిత్రం `జాలీ ఎల్. ఎల్. బి. 2` ఆధారంగా `పక్కా కమర్షియల్`ని రూపొందిస్తున్నారట మారుతి.
అయితే, కేవలం `జాలీ ఎల్. ఎల్. బి. 2` మూల కథను మాత్రమే తీసుకుని తన శైలి వినోదం, మరికొన్ని హంగులు జోడించి.. `పక్కా కమర్షియల్`ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అక్టోబర్ 1 వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |