![]() |
![]() |

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `ఉప్పెన`తో దర్శకుడిగా తొలి అడుగేశాడు బుచ్చిబాబు సానా. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు.. మొదటి ప్రయత్నంలోనే తనదైన ముద్రవేశాడు. అలాగే.. పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో.. బుచ్చిబాబు సెకండ్ వెంచర్ పై ఎనలేని ఆసక్తి నెలకొంది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఉంటుందని తెలిసింది. అంతేకాదు.. ఈ చిత్రం వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుందని.. `ఉప్పెన` తరహాలోనే ఉత్తరాంధ్ర నేపథ్యం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైందని.. ఇందులో ఓ అగ్ర కథానాయకుడు నటించే అవకాశముందని వినికిడి. త్వరలోనే బుచ్చిబాబు సానా సెకండ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, బుచ్చిబాబు మూడో చిత్రం కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే ఉంటుందని కథనాలు వస్తున్నాయి. మరి.. రాబోయే చిత్రాలతోనూ బుచ్చిబాబు విజయ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |