![]() |
![]() |

'చూసీ చూడంగానే' ఫేమ్ శివ కందుకూరి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మను చరిత్ర' షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. శివ సరసన హీరోయిన్లుగా మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని నటిస్తోన్న ఈ చిత్రంతో భరత్ పెదగాని దర్శకునిగా పరిచయమవుతున్నారు.
శివ కందుకూరి బర్త్‌డే సందర్భంగా 'మను చరిత్ర' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తున్నారు శివ. బాగా పెంచిన గడ్డం, నోటిలో సిగరెట్‌తో బైక్ నడుపుతున్న ఆయన ఒంటినిండా గాయాలు కనిపిస్తున్నాయి. అలా బైక్ నడుపుతూనే కుడిచేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఉన్నారు శివ. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందనే అభిప్రాయాన్ని ఈ పోస్టర్ కలిగిస్తోంది. ఫస్ట్ లుక్‌తోటే శివ ఈ సినిమాపై ఆసక్తిని అమితంగా పెంచేశారు.
కాజల్ అగర్వాల్ సమర్పణలో యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్. శ్రీనివాసరెడ్డి, రాన్‌సన్ జోసెఫ్ సంయుక్తంగా 'మను చరిత్ర'ను నిర్మిస్తున్నారు. వరంగల్ నేపథ్యంలో ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని వారు తెలిపారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలి ధనంజయ్, శ్రీకాంత్, అయ్యంగార్, మధునందన్, రఘు, దేవీప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జ శివ, కరణ్, గడ్డం శివ, ప్రదీప్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: భరత్ పెదగాని, నిర్మాతలు: ఎన్. శ్రీనివాసరెడ్డి, పి. రాన్‌సన్ జోసెఫ్, సమర్పణ: కాజల్ అగర్వాల్, బ్యానర్: యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మ్యూజిక్: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఉపేందర్ రెడ్డి, సాహిత్యం: సిరాశ్రీ, కేకే, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్, యాక్షన్: 'రియల్' సతీష్, నందు, పీఆర్వో: వంశీ-శేఖర్.

![]() |
![]() |