![]() |
![]() |

యాక్షన్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `పక్కా కమర్షియల్` పేరుతో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. యూవీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. `టాక్సీవాలా` ఫేమ్ జేక్స్ బిజోయ్ బాణీలు అందిస్తున్న ఈ సినిమా.. మార్చి 5 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. దసరా కానుకగా అక్టోబర్ 1న `పక్కా కమర్షియల్`.. థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ఇద్దరు నాయికలు నటించబోతున్నారని సమాచారం. వారిలో ఒకరిగా రాశీఖన్నా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఎంపికయిందని టాక్. అంతేకాదు.. అభినయానికి అవకాశమున్న పాత్రలో ఈషా దర్శనమివ్వనుందని తెలిసింది. త్వరలోనే `పక్కా కమర్షియల్`లో ఈషా రెబ్బా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. మారుతి డైరెక్టోరియల్ తోనైనా ఈషా దశ, దిశ మారుతాయేమో చూడాలి.
కాగా, ఈషా రెబ్బా ఓ ప్రధాన పాత్రలో నటించిన నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ `పిట్టకథలు` ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |