![]() |
![]() |
.jpg)
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న నూతన చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ 14వ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇది కల్యాణ్‌రామ్‌కు 19వ చిత్రం. మార్చి రెండో వారంలో షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
సినిమా ముహూర్తానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోమవారం పంచుకుంది. వాటితో పాటు, "మా 14వ చిత్రం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఈ రోజు ప్రారంభమైంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 2వ వారంలో షూటింగ్ మొదలవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. #NKR19" అంటూ రాసుకొచ్చింది.
2019లో '118' మూవీతో మంచి విజయం సాధించారు కల్యాణ్‌రామ్. అయితే 2020లో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన 'ఎంత మంచివాడవురా' చిత్రం ఆయనకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కలయికలో చేస్తున్న చిత్రం తనకు తీపి గుర్తులు అందిస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

![]() |
![]() |