![]() |
![]() |

వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో గతంలో 'మనం' సినిమా చేశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. అందులో తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, శ్రీమతి సమంత, తమ్ముడు అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన ఖాతాలో ఓ మెమరబుల్ మూవీని వేసుకున్నాడు. కట్ చేస్తే.. ఏడేళ్ళ విరామం అనంతరం మళ్ళీ విక్రమ్ కాంబోలో మరో సినిమా చేస్తున్నాడిప్పుడు. 'థాంక్ యూ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. 'థాంక్ యూ' సెట్స్ పై ఉండగానే విక్రమ్ తో మరోసారి కలసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ. అయితే, ఈ సారి సినిమా కోసం కాకుండా ఓ వెబ్ సిరీస్ కోసమని సమాచారం. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సిరీస్ ని.. ఓ ప్రముఖ ఓటీటీ వేదిక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందని వినికిడి. త్వరలోనే చైతూ, విక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చైతూకి జంటగా సాయిపల్లవి నటించింది.
![]() |
![]() |