![]() |
![]() |

యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశాల్ చక్ర'. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ జాక్‌పాట్ కొడతారని భరోసా ఇచ్చారు విశాల్. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.
ఇది విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్‌లో వస్తోన్న10వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదారాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర బృందం.
విశాల్ మాట్లాడుతూ - "విశాల్ చక్ర సినిమా ఫిబ్రవరి 19న తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా థియేటర్స్‌లో విడుదలవుతుంది. డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎంఎస్ ఆనందన్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. తప్పకుండా ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో మరో మంచి డైరెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇకపై కూడా మా బేనర్ ద్వారా మంచి డైరెక్టర్స్‌ని, టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. నా తమ్ముడు యువన్ శంకర్ రాజా ఎక్ట్రార్డినరీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. వరంగల్ శ్రీను సహా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమాతో తప్పకుండా ఒక జాక్‌పాట్ కొడతారు. ఫిబ్రవరి 20న అందరం హ్యాపీఫేస్‌తో మీట్ అవుతాం. నా స్నేహితులు హీరో రమణ, నంద చాలా హెల్ప్ చేశారు. అలాగే మా అన్నయ్య బి.ఎ. రాజుగారికి దన్యవాదాలు. నా ప్రతి సినిమాకి ఆయన సొంత సినిమాలాగా అన్నిదగ్గరుండి చూసుకుంటారు. అలాగే చాలా మంది అడుగుతున్నారు స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని.. తప్పకుండా నెక్ట్స్ ఇయర్ ఉగాదికి నా స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలవుతుంది" అన్నారు.
ఈ వేడుకలో దర్శకుడు ఎంఎస్ ఆనందన్, మిస్ ఇండియ డైరెక్టర్ నరేంద్రనాథ్, నటుడు పవన్‌తేజ్ కొణిదెల, నటి మేఘన, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

![]() |
![]() |