![]() |
![]() |

పూజాహెగ్డే.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కేవలం తెలుగునాటే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ వరుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోందీ స్టన్నింగ్ బ్యూటీ.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది పూజకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. వరుసగా మూడు నెలల పాటు పూజ నటించిన చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయని టాక్. ఆ సినిమాలే.. ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, రాధేశ్యామ్.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ 'ఆచార్య'లో చరణ్ కి జోడీగా పూజ తళుక్కున మెరవనుందని సమాచారం. కాగా, ఈ చిత్రం మే 13న థియేటర్స్ లోకి రానుంది. ఇక అక్కినేని బుల్లోడు అఖిల్ కి జంటగా పూజ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'.. జూన్ 19న జనం ముందుకు రానుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలసి పూజ నటించిన పిరియడ్ రొమాంటిక్ సాగా 'రాధేశ్యామ్'.. జూలై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని బజ్.
సో.. మే, జూన్, జూలై.. ఇలా వరుసగా మూడు నెలలు పూజాహెగ్డేదే హవా అన్నమాట. మరి.. ఈ సినిమాలతో పూజ స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
![]() |
![]() |