![]() |
![]() |
.jpg)
ప్రతి రోజూ పండగే వంటి బ్లాక్ బస్టర్ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి నుంచి వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్!. యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా రాశీఖన్నాని ఎంపిక చేశారని టాక్. అదే గనుక నిజమైతే.. జిల్, ఆక్సిజన్ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చే మూడో సినిమా ఇదే అవుతుంది. అలాగే.. ప్రతి రోజూ పండగే తరువాత మారుతి దర్శకత్వంలో రాశి నటించబోయే చిత్రం కూడా ఇదే అవుతుంది. త్వరలోనే పక్కా కమర్షియల్ లో రాశీఖన్నా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ప్రస్తుతం రాశి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తుగ్లక్ దర్బార్, సైతాన్ కా బచ్చా, అరణ్ మణై 3, మేథావి వంటి తమిళ చిత్రాలు, భ్రమమ్ అనే మలయాళ సినిమాతో పాటు అంధాధున్ మలయాళ వెర్షన్ లోనూ తనే నాయిక. అదేవిధంగా.. హిందీనాట ఓ వెబ్ సిరీస్ లోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ సందడి చేయనుంది.
![]() |
![]() |