![]() |
![]() |

హాలీవుడ్ స్టార్ యాక్టర్ లియొనార్డో డికాప్రియో నటించగా, అనంతర కాలంలో క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్న రెండు సినిమాలు - 'షట్టర్ ఐలాండ్', 'ఇన్‌సెప్షన్' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండూ 2010లోనే రావడం గమనార్హం. వరల్డ్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్‌లో ఒకరిగా కీర్తిపొందిన మార్టిన్ స్కోర్సీస్ 'షట్టర్ ఐలాండ్'ను డైరెక్టర్ చేయగా, 'ఇన్‌సెప్షన్'ను నేటి కాలపు గ్రేట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ రూపొందించాడు.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా రూపొందిన 'ఇన్‌సెప్షన్'లో డామ్ కోబ్ అనే దొంగ పాత్రలో లియొనార్డో సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కోబ్ అనేవాడు మామూలు దొంగ కాదు. అతను ఎవర్నయితే టార్గెట్ చేస్తాడో, వారి కలల్లోకి వెళ్లి, తనకు కావాల్సిన ఇన్‌ఫర్మేషన్‌ను దొంగిలిస్తాడు! ఐఎండీబీలో 8.8 రేటింగ్, రాటెన్ టొమాటోస్‌లో 87% రేటింగ్ పొందిన ఈ క్లాసిక్‌లో జోసెఫ్ గోర్డాన్-లెవిట్, టామ్ హార్డీ, సిలియన్ మర్ఫీ, మరియన్ కోటిలార్డ్ కీలక పాత్రలు పోషించారు.

క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'షట్టర్ ఐలాండ్'కు ఐఎండీబీలో 8.2, రాటెన్ టొమాటోస్‌లో 68% రేటింగ్ లభించాయి. టెడ్డీ డేనియల్స్, చక్ ఆలే అనే ఇద్దరు యు.ఎస్. మార్షల్స్‌ను ఒక మారుమూల దీవిలో ఉన్న శరణార్ధి శిబిరానికి పంపిస్తారు. ఆ శిబిరంలోంచి మాయమైన ఒక పేషెంట్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వారి బాధ్యత. ఆ ఇన్వెస్టిగేషన్‌లో టెడ్డీకి ఎలాంటి షాకింగ్ విషయాలు తెలిశాయనేది కథ. టెడ్డీ, చక్ క్యారెక్టర్లను లియొనార్డో డికాప్రియో, మార్క్ రఫెలో (హల్క్) అద్భుతంగా పోషించారు.

సినీ ప్రియులు తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో 'షట్టర్ ఐలాండ్', 'ఇన్‌సెప్షన్' ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఆ సినిమాల్ని చూసెయ్యండి.. మంచి సినిమా చూసిన అనుభవాన్ని ఆస్వాదించండి.
![]() |
![]() |