![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ తో మంచి అనుబంధమే ఉంది. ఈ సీజన్ లో ఏకంగా రెండు ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుని విస్మయపరిచారు బాలయ్య. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత మరోమారు పొంగల్ బరిలో దిగుతున్నారట ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఉగాదికి ప్రారంభించి.. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. అలాగే.. త్వరితగతిన సినిమాని పూర్తిచేసి 2022 సంక్రాంతి బరిలో నిలిపేందుకు ప్రణాళిక జరుగుతోందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రావచ్చు.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ ఎటెంప్ట్ చేస్తున్నారు. మే 28న యన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
![]() |
![]() |